TRS: దుర్గమ్మ ఆలయంలో తలసాని రాజకీయాలు మాట్లాడతారా?: పాలక మండలి ఆగ్రహం
- ఆలయ పవిత్రత దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే సహించం
- తలసాని అడ్డమైన ఆరోపణలు చేశారు
- ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు విజయవాడ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పలకరించిన మీడియాతో రాజకీయాల గురించి ప్రస్తావించారు. అయితే, ఆలయ ప్రాంగణంలో రాజకీయాల గురించి తలసాని మాట్లాడతారా? అంటూ దుర్గగుడి పాలకమండలి సభ్యులు మండిపడుతున్నారు.
ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తే సహించమని, తలసాని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భీమవరంలో కోడిపందాలు ఆడేందుకు వెళ్తూ దుర్గమ్మ ఆలయంలో అడ్డమైన ఆరోపణలు చేశారని పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తలసాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఆలయ అధికారులు అడ్డుకోకపోవడం సరికాదని మండిపడ్డారు. తలసాని వెంటనే క్షమాపణలు చెప్పకపోతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.