india: హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా
- 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు
- 43 పరుగులకు ఔటైన రోహిత్ శర్మ
- 74 పరుగులతో పోరాడుతున్న కోహ్లీ
అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన టీమిండియా 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భాగంగా 47 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. 28 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసిన ధావన్... బెహ్రన్ డార్ఫ్ బౌలింగ్ లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం మరో ఓపెనర్ రోహిత్ శర్మ 52 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 43 వ్యక్తిగత పరుగుల వద్ద స్టోయినిస్ బౌలింగ్ లో హ్యాండ్స్ కోంబ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అనంతరం కోహ్లీకి తోడుగా క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు 24 పరుగులు చేసి స్టోయినిస్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరోవైపు, కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 80 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 4 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 74 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్ లో ధోనీ 6 పరుగులతో ఆడుతున్నాడు.