Narmada River: నర్మదా నదిలో పడవ బోల్తా.. ఆరుగురి మృతి
- 60 మందితో బయలుదేరిన పడవ
- 32 మందిని రక్షించారు
- మృతులంతా సమీప గ్రామ వాసులు
మకర సంక్రాంతి పర్వదినం నాడు మహారాష్ట్రలో తీవ్ర విషాదం నెలకొంది. నదిలో ఓ పడవ బోల్తా పడిన విషాద ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మహారాష్ట్రలోని నందుర్బర్ జిల్లాలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులు తమ ఆచారం ప్రకారం పూజలు నిర్వహించేందుకు నర్మదా నది వద్దకు భారీగా తరలి వచ్చారు.
దాదాపు 60 మంది ప్రయాణికులతో బయలుదేరిన కొద్ది సేపటికే పడవ నీటిలో మునిగిపోయింది. పడవలో చిక్కుకున్న 32 మందిని సహాయక చర్యల ద్వారా రక్షించారు. కానీ ఆరుగురు మాత్రం ఈ ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయిన వారంతా సమీప గిరిజన గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. పరిమితికి మించి ప్రయాణికులు బోటులోకి ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.