Andhra Pradesh: ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటులో మరో ముందడుగు.. జగన్ తో సమావేశమైన కేటీఆర్!
- పార్టీ నేతలతో కలిసి భేటీ
- సాదరంగా ఆహ్వానించిన జగన్
- ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, సంతోష్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డితో కలిసి లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి చేరుకున్నారు. వీరిని వైసీపీ అధినేత జగన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, అందులోని సాధ్యాసాధ్యాలపై జగన్ తో కేటీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో వైపీసీ తరఫున విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, పార్థసారథి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ భేటీ అనంతరం కుమార్తె హర్షను కలుసుకునేందుకు కుటుంబంతో కలిసి జగన్ లండన్ కు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ కుమార్తె హర్ష ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదువుతున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని వైసీపీ వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు.