Sangareddy District: సర్పంచ్ ఎన్నికల బరిలో దిగేందుకు అమెరికా నుంచి తిరిగొచ్చిన వివాహిత

  • కాసాల సర్పంచ్ పదవి ఓసీ మహిళకు కేటాయింపు
  • అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి శ్వేత
  • జోరుగా ప్రచారం

తెలంగాణలో ఈ నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ మహిళ అమెరికా నుంచి స్వగ్రామానికి తిరిగొచ్చింది. తమ గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఓసీ మహిళకు రిజర్వు చేయడంతో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆమె భర్త, పిల్లలతో కలిసి స్వగ్రామానికి తిరిగొచ్చింది.

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని కాసాల గ్రామ సర్పంచ్ పదవిని ఓసీ మహిళకు కేటాయించారు. గత పుష్కర కాలంగా అమెరికాలోని మేరీలాండ్‌లో భర్త గౌరెడ్డిగారి అనిల్‌రెడ్డితో కలిసి ఉంటున్న ఆమె విషయం తెలిసి, ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అనిల్ అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, ఎమ్మెస్సీ, బీఈడీ చేసిన  శ్వేత ప్రి-స్కూల్ సంచాలకురాలు. అనుకున్నదే తడవుగా వారి కుటుంబం అమెరికా నుంచి స్వగ్రామంలో వాలిపోయింది.

అనిల్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఆయన తండ్రి  లింగారెడ్డి గ్రామ సహకార సంఘం అధ్యక్షుడు. సర్పంచ్ పదవికి ప్రస్తుతం ఐదుగురు మహిళలు పోటీలో ఉన్నారు. బరిలో ఉన్న శ్వేత తాను సర్పంచ్‌ను అయితే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసేది వివరిస్తూ 12 అంశాలతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News