Hyderabad: దేవినేని ఉమకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మిధున్ రెడ్డి!
- నిన్న హైదరాబాద్ లో జగన్, కేటీఆర్ భేటీ
- టీఆర్ఎస్ తో ఎలా కలుస్తారంటూ దేవినేని విమర్శ
- తెలుగుదేశం పార్టీయే పొత్తుకు వెంపర్లాడిందన్న మిధున్ రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను, నిన్న హైదరాబాద్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి చర్చలు జరపడం, ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీయగా, జగన్ ను టార్గెట్ చేసుకుని ఏపీ మంత్రి దేవినేని ఉమ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ తో ఎలా కలుస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి నిప్పులు చెరిగారు.
చంద్రబాబునాయుడు నాలుగున్నరేళ్లు ఎన్డీయేతో పొత్తు పెట్టుకుని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ, కేసీఆర్ నిరాకరించడంతోనే కాంగ్రెస్ తో కలిసిందని ఆయన అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ ను కేటీఆర్ ఆహ్వానించడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తట్టుకోలేకున్నారని మిధున్ రెడ్డి మండిపడ్డారు.