earth quake: అండమాన్ నికోబార్ దీవుల్లో కంపించిన భూమి
- రిక్టర్ స్కేలుపై 6గా నమోదు
- ఉదయం 8.43 గంటల సమయంలో భూకంపం
- వెల్లడించిన నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ
అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. నికోబార్ ద్వీపాల ప్రాంతంలో బంగాళాఖాతంలో 84 కిలోమీటర్ల లోతున గురువారం ఉదయం 8.43 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చిందని, కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ ప్రతినిధులు వెల్లడించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలేవీ వెల్లడి కాలేదు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదు.