bjp: బీజేపీని వీపు మీద మోయడం కంటే.. ఈ పని చేయడం బెటర్: అన్నాడీఎంకే

  • పార్టీ కేడర్ ను బలోపేతం చేసుకోవడం మేలు
  • ఆ పార్టీతో పొత్తు పెట్టుకోం
  • వాళ్లు బలపడేందుకు అవకాశమిస్తామనడం కంటే పెద్ద జోక్ ఉండదు

తమిళనాడులో బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట పొత్తులు ఉంటాయంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంతో... అందరి దృష్టి అన్నాడీఎంకే వైపు మరలింది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత తంబిదురై స్పందిస్తూ, బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని తెలిపారు. బీజేపీని వీపు మీద మోస్తామనడం, తమిళనాట వాళ్లు బలపడేందుకు అవకాశమిస్తామనడం కంటే పెద్ద జోక్ మరొకటి ఉండదని చెప్పారు. బీజేపీని మోయడం కంటే... సొంత కేడర్ ను బలోపేతం చేసుకోవడమే మేలని అన్నారు. తమిళనాడులో తమ పని తాము చూసుకుంటామని, వాళ్ల సంగతి వాళ్లు చూసుకుంటారని చెప్పారు.

గతవారం తమిళనాడు బీజేపీ క్షేత్రస్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సంభాషించారు. పొత్తుల కోసం తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. పాత మిత్రుల ప్రయోజనాలను కాపాడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News