Smell: ముందుగా 2 నిమిషాలు వాసన చూడండి... ఆపై మీరే తక్కువ తింటారు!
- యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా అధ్యయనం
- వాసన పీలిస్తే ఎంతో సంతృప్తి
- ఆపై తక్కువగానే లోపలికి వెళుతుంది
- అధ్యయన వివరాలు ప్రచురించిన 'మార్కెటింగ్ రీసెర్చ్'
నోరూరించేలా కంటిముందు ఏదైనా కనిపిస్తే, కడుపు నిండా లాగించేయాలని అనుకుంటారు ఎవరైనా. ఇదే సమయంలో కొవ్వు పెరిగి ఊబకాయం వస్తుందన్న భయం కూడా వెంటాడుతుంటుంది. అయితే, కంటి ముందు కనిపిస్తున్న ఆహార పదార్థాలను రెండు నిమిషాల పాటు వాసన చూస్తే, ఆపై ఆటోమేటిక్ గా తక్కువగా తింటారట.
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా రీసెర్చర్లు ఓ అధ్యయనం నిర్వహించి, ఈ విషయాన్ని కనుగొనగా, 'మార్కెటింగ్ రిసెర్చ్' అనే జర్నల్ దీన్ని ప్రచురించింది. 2 నిమిషాలు వాసన చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఆ తర్వాత ఆహారం ఏది అయినా, తక్కువగానే తీసుకుంటామని, క్యాలరీలు పెరుగుతాయన్న భయం ఉండదని చెప్పింది. ఆహారం వాసన వల్ల సంతృప్తి లభించడమే దీనికి కారణమని వివరించింది. ఈ అధ్యయన బృందంలో ఓ ఇండియన్ ప్రొఫెసర్ కూడా ఉండటం గమనార్హం.