YSRCP: దటీజ్ కోటంరెడ్డి.. మురుగు కాలువలోకి దిగి నిరసన తెలిపి.. బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయించిన వైసీపీ ఎమ్మెల్యే!
- వంతెన నిర్మాణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం
- నిరసనగా మురుగు నీటిలోకి దిగిపోయిన కోటంరెడ్డి
- హారతి ఇచ్చి స్వాగతించిన స్థానిక ప్రజలు
నెల్లూరు జిల్లాలో ఉడుముల వాగు బ్రిడ్జి నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అధికారుల తీరును నిరసిస్తూ ఆయన మురుగు కాలువలోకి దిగి శాంతియుతంగా నిరసన తెలిపారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో నెల్లూరు మున్సిపల్ అధికారుల నుంచి స్పష్టమైన హామీ అందడంతో కోటంరెడ్డి ముందుకు కదిలారు.
తాజాగా ఉడుముల వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంతెనను ఈరోజు ఆవిష్కరించారు. ఈ విషయమై స్థానికులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కారణంగానే బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి హారతి ఇచ్చారు. మరోవైపు శాంతియుతంగా బ్రిడ్జి నిర్మాణం కోసం పోరాడిన కోటంరెడ్డికి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి హ్యాట్సాఫ్ చెప్పారు. దీంతో కోటంరెడ్డి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
హ్యాట్సాఫ్ #కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు... pic.twitter.com/ogV42WWws3
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 20, 2019