cuddapah: కడప జిల్లా రాజంపేట టీడీపీలో ముదిరిన వర్గ పోరు
- మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులను అడ్డుకున్న మేడా వర్గం
- సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహణపై అభ్యంతరం
- పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం
కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ముదురుతోంది. మంత్రి ఆదినారాయణరెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మధ్య వర్గ పోరు తీవ్రస్థాయికి చేరింది. ఆదివారం ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలు రాజంపేట రాగా మల్లికార్జునరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు.
తమ నాయకునికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇక్కడ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు. దీంతో ఇరువర్గా మధ్య వివాదం మొదలయ్యింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పి ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది. మేడా మల్లికార్జున రెడ్డి పార్టీ వీడుతారన్న ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. మరోపక్క, సమస్య తెలుసుకునేందుకు సీఎం రమ్మని కబురుపెట్టినా ఆయన పట్టించుకోలేదని, దీంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని సమాచారం.