KTR: కొన్ని వార్తాసంస్థలకు ఇంగితజ్ఞానం కూడా ఉండదు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- పీఎం కావాలన్న ఉద్దేశంతో కేసీఆర్ యాగాలు
- వార్తను అందించిన సీఎన్ఎన్ న్యూస్ 18
- కనీస ఇంగితజ్ఞానం లేదన్న కేటీఆర్
ఓ దినపత్రికలో తాను ప్రధానమంత్రిని కావాలన్న ఉద్దేశంతోనే యజ్ఞాలు, యాగాలు చేయిస్తున్నానని కేసీఆర్ చెప్పినట్టు వచ్చిన వార్తపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మూడు యాగాలు చేయిస్తున్నారంటూ సీఎన్ఎన్ న్యూస్ 18 ఓ వార్తను అందించగా, దాన్ని చూసిన ఓ నెటిజన్, కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ, ఇది తప్పుడు వార్తలా ఉందని స్పందించాలని కోరాడు. ఆపై కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "కొన్ని వార్తా సంస్థలు కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా, నిజానిజాలను పరిశీలించకుండా వార్తలను ప్రచురిస్తుంటాయి. దీన్ని ఆయా వార్తా సంస్థల సంపాదకుల విజ్ఞతకే వదిలేద్దాం" అని అన్నారు.
@KTRTRS sir, I think the below news published by @CNNnews18 appear to be fake. I never heard KCR saying he is aspiring to become PM hence doing Yagas.
— Harshavardhan Musanalli (@harshavmb) January 21, 2019
Please respond. #kcr #FakeNews #fake #news18 pic.twitter.com/qPuOUDcCsK