Stock market: లాభాలలో ముగిసిన నేటి స్టాక్ మార్కెట్లు
- ఆద్యంతం లాభాల్లోనే ట్రేడింగ్
- సెన్సెక్స్ 192.35 పాయింట్ల లాభం
- నిఫ్టీ 54.90 పాయింట్ల లాభం
మన స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఈ రోజు మార్కెట్లు ప్రారంభం నుంచీ లాభాలతోనే ట్రేడ్ అయ్యాయి. ఆయా కంపెనీల త్రైమాసిక ఫలితాలు బాగుండడంతో ఆ ప్రభావం మార్కెట్లపై కనిపించింది. ఇంధన, ఫార్మా రంగాల షేర్ల అండతో మార్కెట్లు దూసుకుపోయాయి. దీంతో 192.35 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 36578.96 వద్ద, 54.90 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10961.90 వద్ద ముగిశాయి.
ఇక రిలయన్స్, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీల షేర్లు లాభాలు దండుకోగా, హీరో మోటాకార్ప్, విప్రో, ఎస్ బ్యాంక్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ తదితర షేర్లు నష్టపోయాయి.