Odisha: కోస్తా, రాయలసీమలో మళ్లీ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- ఒడిశాలో అధిక పీడనం
- సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువ
- కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం
ఒడిశాలో నెలకొన్న అధిక పీడన ప్రభావం ఏపీలోని కోస్తా, రాయలసీమలపై పడుతోంది. అధిక పీడనం కారణంగా వీస్తున్న చలిగాలుల వల్ల కోస్తా, రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఫలితంగా జనాలు చలితో వణుకుతున్నారు. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి.
సోమవారం చింతపల్లిలో 8.5 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 13 డిగ్రీలు, అనంతపురం, విశాఖ విమానాశ్రయంలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు మంచు కారణంగా కోస్తాలో విజిబిలిటీ 200 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ నెల 26 నుంచి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.