Nalgonda District: బెల్టుషాపు నిర్వాహకుడి ఆత్మహత్య.. పెద్దవూర గ్రామంలో ఉద్రిక్తత

  • టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణ
  • బెల్టుషాపులు కారణమని భావించిన పోలీసులు
  • సీఐ, ఎస్సైలపై దాడికి యత్నం

నల్గొండ జిల్లాల్లోని పెద్దవూరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెల్ట్ షాపు నిర్వాహకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో ఒక్కసారిగా గ్రామంలో ఆందోళన నెలకొంది. సోమవారం రాత్రి గెమ్యానాయక్ తండాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు కారణం బెల్టుషాపులు కూడా అని భావించిన పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బెల్టుషాపు నిర్వాహకుడు శ్రీను(31) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టడమే కాకుండా.. సీఐ, ఎస్సైలపై దాడికి యత్నించారు. దీంతో గ్రామమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News