chattisgarh: 33 ఏళ్లుగా కేవలం తేనీరే ఆమె ఆహారం.. ఏమి'టీ' రహస్యం?

  • ఆమెకు టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌ ఏదైనా టీతోనే
  • అయినా సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్న మహిళ
  • ఛత్తిస్‌గఢ్‌ రాష్ట్రం పిల్లి దేవి ఘనత ఇది

గ్రామంలో ఆమెను అంతా ‘చాయ్‌ వాలీ చాచీ’ అని పిలుస్తారు. అంటే ఆమేదో చాయ్‌ అమ్ముకుని బతుకుతోందని కాదు. గడచిన 33 ఏళ్లుగా ఆమె చాయ్‌తోనే జీవిస్తోందని గ్రామస్థులు ఆ పేరు పెట్టారు. సాధారణంగా మనం ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రీ భోజనం లాగించేస్తాం. కానీ అమెకు అవేమీ అక్కర్లేదు. బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ అన్నీ టీతోనే. ఛత్తిస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొఠియా జిల్లా బరాదియా గ్రామానికి చెందిన పిల్లి దేవి ప్రత్యేకత ఇదంతా!

11 ఏళ్ల వయసులో ఆహారాన్ని తీసుకోవడం మానేసిన దేవి వయసు ప్రస్తుతం 44 ఏళ్లు. 33 ఏళ్లుగా ఆమె ఎటువంటి ఆహారం తీసుకోకపోయినా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం మరో ప్రత్యేకత. ఆరో తరగతిలో ఉండగా తన కూతురు తిండి తినడం మానేసిందని దేవి తండ్రి రతీరామ్ తెలిపారు. ‘జనక్ పూర్ లోని పాట్నా పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో పాల్గొనేందుకు దేవి వెళ్లింది. ఆ తర్వాత నుంచి తిండి, నీళ్లు మానేసింది’ అని రతీరామ్ వాపోయారు.

కొన్నాళ్లు టీతో బిస్కెట్లు, బ్రెడ్ తినేది. ఆ తర్వాత పూర్తిగా బ్లాక్ టీ మీదే బతుకుతోందన్నారు. ఇప్పుడామె సూర్యాస్తమయం తర్వాత ఒకసారి కప్పు బ్లాక్ టీ మాత్రం తాగుతుందని తెలిపారు. రోజంతా శివారాధనలోనే గడుపుతుందని, ఎప్పుడో తప్ప ఇంటి నుంచి అడుగు బయటపెట్టదని తెలిపారు.

ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమోనని కంగారుపడి  డాక్టర్ల  వద్దకు తీసుకుపోతే ఆమె ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్పారని  వివరించారు. మనుషులు కేవలం టీ తాగి బతకడం అసాధ్యమని, 33 ఏళ్లుగా ఆమె టీతో జీవించడం ఆశ్చర్యపరుస్తోందని కొఠియా జిల్లా ఆసుప త్రి వైద్యుడు ఎస్.కె.గుప్తా అన్నారు.

  • Loading...

More Telugu News