Vijayawada: మావద్ద శిక్షణ పొందిన వారి పథకాలు మేమెందుకు కాపీ కొడతాం?: ఎంపీ కొనకళ్ల వ్యంగ్యాస్త్రం
- టీఆర్ఎస్ను అనుకరించాల్సిన ఖర్మ పట్టలేదు
- మిగులు బడ్జెట్ ఉన్నా తెలంగాణ చతికిలపడింది
- లోటు బడ్జెట్ ఉన్నా ఏపీ అన్నింటా ముందుంది
తెలుగుదేశం పార్టీలో రాజకీయ పాఠాలు నేర్చుకున్న వారు అమలు చేసే పథకాలు చూసి కాపీ కొట్టాల్సిన ఖర్మ టీడీపీ ప్రభుత్వానికి లేదని ఎంపీ కొనకళ్ల నారాయణ వ్యంగ్యంగా అన్నారు. విజయవాడలో నేడు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'మా వద్ద శిక్షణ పొందిన వారిని అనుసరించాల్సిన అవసరం మాకెందుకు?' అని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత మిగులు బడ్జెట్తో అధికారం చేతుల్లోకి వచ్చినా కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వెనుకబడిందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా చంద్రబాబు పథకాల అమల్లో ముందున్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ను అనుసరిస్తున్నామని ఆ పార్టీ నాయకులు అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లపై మాట్లాడుతూ టీడీపీ మాట నిలబెట్టుకుందని చెప్పారు.