anil ravipudi: నన్ను క్షమించమని బ్రహ్మానందం గారితో అన్నాను: అనిల్ రావిపూడి
- బ్రహ్మానందం గారంటే నాకు ఎంతో ఇష్టం
- నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు
- తరువాత సినిమాలో ఆయన వుంటారు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్ 2' సంక్రాంతి మొదలు తన సందడిని కొనసాగిస్తూనే వుంది. వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. "మీకు బాగా ట్యూన్ అయిన ఆర్టిస్ట్ కి ఇంతవరకూ మీ సినిమాలో అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఉందా?" అనే ప్రశ్న అనిల్ రావిపూడికి ఎదురైంది.
అందుకు ఆయన స్పందిస్తూ .."నాకు బాగా నచ్చిన ఆర్టిస్ట్ బ్రహ్మానందం గారు. ఆయనతో నేను చాలా చనువుగా ఉండేవాడిని. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్నప్పటి నుంచి ఆయన నన్నెంతో ఆత్మీయంగా పలకరించేవారు. దురదృష్టవశాత్తు ఇంతవరకూ ఆయనతో చేయలేకపోయాను. బడ్జెట్ పరంగా .. స్క్రిప్ట్ పరంగా ఆయనని తీసుకునే అవకాశం రాకపోవడమే అందుకు కారణం. ఇటీవలే రామానాయుడు స్టూడియోలో ఆయనని కలిశాను. ఎంతో ప్రేమగా ఆయన మాట్లాడారు. 'నన్ను క్షమించండి సార్ .. తరువాత సినిమాలో మీరు తప్పకుండా ఉంటారు' అని అన్నాను" అని చెప్పుకొచ్చాడు.