Andhra Pradesh: అమెరికా, జపాన్, జర్మనీలే ఈవీఎంలను వాడటం లేదు.. బ్యాలెట్ విధానం తీసుకురావాల్సిందే!: సీఎం చంద్రబాబు
- ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయి
- వీటి సమర్థతపై అనుమానాలు ఉన్నాయి
- ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి
భారత్ లో ప్రస్తుతం ఎన్నికలకు వాడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదంగా తయారు అయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను ట్యాంపరింగ్ లేదా హ్యాక్ చేయగలరన్న అనుమానాలు నెలకొన్నాయన్నారు.
అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్, జర్మనీ లాంటి దేశాలే ఈవీఎంలను వాడటం లేదని ఏపీ సీఎం గుర్తుచేశారు. మళ్లీ బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు.. అవుట్ లుక్ ఇండియాలో ప్రచురితమైన ఓ కథనం లింక్ ను జతచేశారు.