Kodandaram: ఎన్నికల కమిషన్ సలహాలు మాకు అక్కర్లేదు: టీజేఎస్ అధినేత కోదండరామ్
- రాజ్యాంగబద్ధంగా వారు చేయాల్సింది చేస్తే చాలు
- పాలకులు కూడా రాజ్యాంగాన్ని అనుసరించాలి
- రాజ్యాంగం అంటే రాజకీయ విప్లవం
ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో వారు అది చేస్తే చాలని, తామేం చేయాలో సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని టీజేఎస్ అధినేత కోదండరామ్ అన్నారు. కమిషన్కు సంబంధించిన అంశాల్లో అడిగే హక్కు తమకు ఉందని, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల అధికారికి ఉందని స్పష్టం చేశారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అంటే రాజకీయ విప్లవం రావటం అన్నారు. భవిష్యత్తు నిర్మాణానికి బ్లూ ప్రింటు అని చెప్పారు. పాలకులు ఎవరైనా రాజ్యాంగ చట్రంలో నిలబడి పాలన చేయాలని, రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.