amaravathi: రేపటి నుంచి ఏపీ రాజధాని అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు
- భూములు ఇచ్చిన రైతులకు సర్కారు నజరానా
- తుళ్లూరు కేవీఆర్ జెడ్పీ హైస్కూల్లో కార్యక్రమం
- ప్రకటించిన సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు శుభవార్త. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రైతులకు ప్లాట్ల కేటాయింపు సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు సంబంధిత రైతులకు ఇప్పటికే సమాచారం అందించామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ ప్రకటించారు. రాజధాని నిర్మాణంకోసం ప్రభుత్వం రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములు సేకరించిన విషయం తెలిసిందే. తుళ్లూరు కేవీఆర్ జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్లో మొత్తం 2,377 మంది లబ్ధిదారులు ఉన్నారని, వీరంతా తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.