mehul choksi: చోక్సీని ఇండియాకు రప్పించడంలో భారత్ కు ఎదురుదెబ్బ... ఇండియాకు పంపబోమన్న అంటిగ్వా
- భారత పౌరసత్వాన్ని చోక్సీ వదిలేశారన్న అంటిగ్వా ప్రధాని కార్యాలయ అధికారి
- ప్రస్తుతం ఆయన అంటిగ్వా పౌరుడు
- అంటిగ్వా పౌరసత్వాన్ని రద్దు చేయలేం
పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి అంటిగ్వాకు చెక్కేసిన మెహుల్ చోక్సీని స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీని ఇండియాకు పంపబోమని... ప్రస్తుతం ఆయన అంటిగ్వా పౌరుడని ఓ అధికారి స్పష్టం చేశారు. చోక్సీ కోసం అంటిగ్వా, బార్బుడాలకు భారత్ నుంచి అధికారులు వస్తున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని అంటిగ్వా ప్రధాని కార్యాలయ సిబ్బంది చీఫ్ మాక్స్ హర్ట్ తెలిపారు. భారత పౌరసత్వాన్ని చోక్సీ వదిలేశారని.... ప్రస్తుతం ఆయన అంటిగ్వా పౌరుడని, ఆయన పౌరసత్వాన్ని తాము రద్దు చేయబోమని చెప్పారు.