sensex: ఒత్తిడికి గురైన బ్యాంకింగ్ స్టాక్స్.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
- 368 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 119 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, పార్మా స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో దేశీయ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే సూచీలు రెడ్ లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మార్కెట్ల పతనం కొనసాగుతూనే వచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 368 పాయింట్లు నష్టపోయి 35,656కు పడిపోయింది. నిఫ్టీ 119 పాయింట్లు కోల్పోయి 10,661కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా తదితర కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ, టీసీఎస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ తదితర కంపెనీలు లాభాలను మూటగట్టుకున్నాయి.