Facebook: ఫేస్ బుక్ నుంచి వాట్స్ యాప్, ఇన్ స్టాగ్రామ్ కు మెసేజ్... తీవ్ర కసరత్తు చేస్తున్న ఫేస్ బుక్!
- ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ మెసెంజర్ లతో అనుసంధానం
- ప్రైవసీకి భంగం కలుగకుండా చర్యలు తీసుకుంటున్న ఫేస్ బుక్
- ఈ సంవత్సరం చివరికి సేవలందే అవకాశం
ఫేస్ బుక్ లో మీరు లాగిన్ అయి వున్నారు. అదే సమయంలో వాట్స్ యాప్ లో ఉన్న మీ కుటుంబీకుడికో, ఇన్ స్టాగ్రామ్ చూస్తున్న స్నేహితుడికో మెసేజ్ ని పంపగలిగితే... చాలా బాగుంటుంది కదా? దీనిని దృష్టిలో పెట్టుకునే.. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ మెసెంజర్ ను కలుపుతూ ఒకేసారి మెసేజ్ లను పంపే సేవలను ప్రారంభించేందుకు ఫేస్ బుక్ యాజమాన్యం తీవ్ర కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లూ వేర్వేరు యాప్ లుగా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడింటినీ అనుసంధానం చేసే ప్రయత్నాల్లో ఉన్న ఫేస్ బుక్, ఇందువల్ల వినియోగదారుల ప్రైవసీకి భంగం కలుగుతుందా? అన్న కోణంలో పరీక్షలు నిర్వహిస్తోంది. అన్నీ కలిసొస్తే, ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో మూడు సోషల్ మీడియా దిగ్గజాలనూ కలిపే సేవలు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.