Suman: ఆ సన్నివేశాన్ని చూపించడానికి గట్స్ కావాలి.. అది కేవలం రాజమౌళికే సాధ్యం: సుమన్

  • అసలైన హీరో ప్రభాస్ కాదు.. రానా
  • చివరి వరకూ రానాదే పవర్‌ఫుల్ పాత్ర
  • ప్రతినాయకుడి పాత్రను చంపడం సులువు కాదు

తెలుగు చిత్ర పరిశ్రమను ‘బాహుబలి’కి ముందు, తర్వాతగా చూస్తున్నారంటే.. ఆ ఘనత కచ్చితంగా దర్శకధీరుడు రాజమౌళిదే. ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ అవన్నీ నాన్ బాహుబలి రికార్డులను మాత్రమే క్రియేట్ చేయగలిగాయి కానీ ‘బాహుబలి’ రికార్డును మాత్రం కదపలేకపోయాయి. ఈ సినిమాలో కథానాయకుడికి ఎంతటి ప్రాధాన్యముందో.. ప్రతి నాయకుడికి అంతే ప్రాధాన్యముంటుంది. ప్రతినాయకుడి పాత్రను చంపడం అంత సులువు కాదని, అలాంటి సన్నివేశాలను చూపించగలిగే గట్స్ కేవలం రాజమౌళికి మాత్రమే ఉన్నాయని ప్రముఖ సినీ నటుడు సుమన్ వ్యాఖ్యానించారు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘బాహుబలి’ సినిమాలో అసలైన హీరో ప్రభాస్‌ కాదు.. రానా. మీరు గమనించినట్లైతే క్లైమాక్స్‌లో ప్రభాస్‌ టచ్‌ చేయకుండానే రానా పాత్ర మంటల్లో పడి చనిపోతుంది. దీన్ని బట్టి చూస్తే సినిమా చివరి వరకు రానాదే పవర్‌ఫుల్‌ పాత్ర. సినిమాలో ఓ ప్రతినాయకుడి పాత్రను చంపడం అంత సులువు కాదు. ఆ సన్నివేశాన్ని చూపించడానికి గట్స్‌ కావాలి. అది కేవలం రాజమౌళికే సాధ్యమైంది. క్లైమాక్స్‌ వరకు ఓ హీరో 40 మంది రౌడీలను కొట్టడంలో పెద్ద విషయం ఏమీ లేదు’’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News