Varla Ramaiah: ఎన్నికలయ్యే వరకూ కేసును తొక్కిపట్టే ఒప్పందం మోదీ-జగన్‌ల మధ్య జరిగింది: వర్ల రామయ్య
- మోదీ, అమిత్‌షా ఏం హామీ ఇచ్చారో చెప్పాలి
- జగన్ కేసు విషయమై శ్వేతపత్రం విడుదల చేయాలి
- సాక్ష్యాలున్నా కేసును నీరుగారుస్తున్నారు
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్, సీబీఐ కలిసి ప్రయాణం చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, అమిత్ షా.. జగన్‌కు ఏం హామీ ఇచ్చారో జగన్ చెప్పాలని, జగన్ కేసు విషయమై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌పై చార్జిషీటు దాఖలు చేసి ఏడేళ్లయిందని.. పటిష్టమైన సాక్ష్యాలున్నా కేసును నీరుగారుస్తున్నారని, దీనికి సీబీఐ తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని వర్ల రామయ్య అన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ కేసును తొక్కిపట్టే ఒప్పందం జరిగిందని... రాజకీయ లబ్ది కోసమే నేరస్థులతో మోదీ కలుస్తున్నారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు.