Chandrababu: 'జయహో బీసీ' హామీలపై కసరత్తు.. కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు కేబినెట్
- 9న సామూహిక గృహ ప్రవేశాల పండుగ
- ప్రభుత్వ మెడికల్ కళాశాలకు గ్రీన్ సిగ్నల్
- రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహాల అందజేత
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో జయహో బీసీ హామీలపై కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 9న సామూహిక గృహ ప్రవేశాల పండుగను భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నెల్లూరులో జరిగే గృహ ప్రవేశాల వేడుకలో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా.. రాబోయే మూడేళ్లలో దీని కోసం రూ.260 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. విశాఖ జిలాల్లోని ఆనందపురం గిడిజాల గ్రామంలో మహిళా పారిశ్రామిక వేత్తలకు 50 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఫిబ్రవరి 9న రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహాలను, అర్బన్‌లో లక్ష, రూరల్‌లో 3 లక్షల గృహాలను లబ్దిదారులకు అందజేయనున్నారు.