interim budget: అభివృద్ధి పథంలో నడిపించే బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ
- దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ ముందడుగు
- వ్యవసాయంతో పాటు రైతులను పరిపుష్టం చేసే బడ్జెటిది
- 12 కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం
కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి పథంలో నడిపించే బడ్జెట్ ఇది అని, దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ ముందడుగు అని అన్నారు. అన్ని వర్గాల్లో సంతృప్తినిచ్చిన, వ్యవసాయ రంగంతో పాటు రైతులను పరిపుష్టం చేసే బడ్జెట్ ఇది అని చెప్పారు. ఆదాయపన్ను రూ.5 లక్షలకు పెంచాలన్నది ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రజల కోరిక అని, ఆ కోరికను తమ ప్రభుత్వం నెరవేర్చబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. ‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా 50 కోట్ల మందికి, ‘స్వచ్ఛభారత్’ ద్వారా 9 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరిందని అన్నారు. ఈ బడ్జెట్ 12 కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చిందని, మూడు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.