K Kavitha: కేసీఆర్ పేరిట ఫేక్ ట్విట్టర్ ఖాతా... 'సెన్స్ లెస్' పోస్ట్ చూసి స్పందించిన కవిత !
- కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్న
- వ్యతిరేకిస్తే సంతోషిస్తానన్న వ్యక్తి
- సచివాలయానికి ఎప్పుడైనా వెళ్లావా? అన్న కవిత
'రియల్ కేసీఆర్' పేరిట ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్న ఓ వ్యక్తి పెట్టిన ట్విట్టర్ పోస్టుపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. "రియల్ కేసీఆర్ అన్న పేరు వెనుక దాగుండి ఫేక్ ఎకౌంట్ ను నడుపుతున్న మిత్రమా... నువ్వు ఎప్పుడైనా పాత సెక్రటేరియేట్ కు వెళ్లావా?" అని ప్రశ్నించారు.
అంతకుముందు 'రియల్ కేసీఆర్' ఖాతాలో "మన తెలంగాణకు కొత్త సచివాలయం అవసరమా? కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఈ సెన్స్ లెస్ నిర్ణయాలను ఆపలేమా? తెలంగాణ వాసిగా నేను గర్విస్తున్నాను. ఇదే సమయంలో మీరు ఈ సెన్స్ లెస్ ఆలోచనను వ్యతిరేకిస్తే సంతోషిస్తాను. మన ఆర్మీపై గౌరవం, ప్రేమతో..." అని వ్యాఖ్యానించాడు. దానిపై స్పందించిన కవిత, ఇప్పుడున్న సచివాలయాన్ని ఎప్పుడైనా చూశావా? అని ప్రశ్నించారు.
Dear Fake Account hiding under the name of RealKCR .. Have You ever been to the old secretariat ? https://t.co/s3R3XMe3BF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 2, 2019