Andhra Pradesh: కౌలు రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటాం!: ఏపీ మంత్రి ప్రత్తిపాటి
- 5.13 లక్షల మంది కౌలు రైతులకు రుణాల కార్డులు
- రుణాలను పొందిన 2.62 లక్షల మంది
- ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల సంక్షేమంపై టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికిపైగా కౌలు రైతులకు ‘రుణ అర్హత కార్డులు’ మంజూరు చేశామని, వీరిలో 2.62 లక్షల మంది రైతులు రుణాలను పొందారని పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి ఈ మేరకు స్పందించారు. ఇప్పటివరకూ 5.13 లక్షల రైతు రుణ అర్హత కార్డులను రెవిన్యూ శాఖ జారీచేసిందని మంత్రి తెలిపారు. అర్హులైన కౌలు రైతులకు బ్యాంకర్లు వెంటనే రుణాలను మంజూరు చేస్తున్నారని అన్నారు. రైతులను టీడీపీ ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు.