charan: తీసుకున్న పారితోషికం నుంచి 5 కోట్లు వెనక్కి ఇచ్చేస్తోన్న చరణ్
- పరాజయాన్ని మూటగట్టుకున్న చరణ్ మూవీ
- బయ్యర్లకు 30 కోట్ల వరకూ నష్టాలు
- 15 కోట్లను పరిహారంగా ఇవ్వాలనే నిర్ణయం
చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' ఇటీవల సంక్రాంతి బరిలో నిలిచింది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. దాంతో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయామని చెప్పేసి చరణ్ ఒక ప్రెస్ నోట్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశాడు.
ఈ సినిమా వలన బయ్యర్లు 30 కోట్ల వరకూ నష్టపోయారట. వాళ్ల నష్టాన్ని కొంతవరకైనా తగ్గించవలసిన బాధ్యత తమపై ఉందనే అభిప్రాయాన్ని నిర్మాత దానయ్య దగ్గర చరణ్ వ్యక్తం చేశాడట. దాంతో ఇద్దరూ కలిసి ఓ 15 కోట్లను పరిహారంగా చెల్లిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారని వినికిడి. ఈ సినిమాకి గాను తాను తీసుకున్న పారితోషికంలో నుంచి 5 కోట్లను తిరిగి ఇచ్చేయడానికి చరణ్ సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఇక మిగతా 10 కోట్లను సమకూర్చే విషయంలో దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.