stalin: ఇంతటి తీవ్ర ఆరోపణలను ఒక ప్రధాని ఎదుర్కోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం: స్టాలిన్

  • సుప్రీంకోర్టు ధిక్కారానికి మోదీ పాల్పడ్డారనిపిస్తోంది
  • ఫ్రాన్స్ ప్రభుత్వంతో పీఎంవో చర్చలు జరిపిన విషయాన్ని సుప్రీంకు తెలపలేదు
  • రాఫెల్ డీల్ పై ఓ పత్రికలో వచ్చిన కథనంపై స్టాలిన్ స్పందన

సుప్రీంకోర్టు ధిక్కారానికి ప్రధాని మోదీ పాల్పడ్డారనిపిస్తోందని డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శించారు. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ తో ప్రధాని కార్యాలయం నేరుగా చర్చలు జరిపిందని, దీనిపై రక్షణ శాఖ కూడా అభ్యంతరం తెలిపిందని ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కథనంపై స్టాలిన్ స్పందిస్తూ, ఫ్రాన్స్ ప్రభుత్వంతో ప్రధాని కార్యాలయం చర్చలు జరిపిన విషయాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించిన సీల్డ్ కవర్ లో కేంద్రం ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. ఇంతటి తీవ్ర ఆరోపణలను ఒక ప్రధాని ఎదుర్కోవడం భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదని చెప్పారు.

మరోవైపు పార్లమెంటులో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, సమయానుకూలంగా ప్రధాని కార్యాలయం ఆరా తీయడాన్ని ప్రత్యక్ష జోక్యంగా భావించవద్దని వివరణ ఇచ్చారు. యూపీఏ హయాంలో ప్రధాని  కార్యాలయాన్ని సోనియాగాంధీ తరచుగా పర్యవేక్షించే వారని... అది జోక్యం చేసుకోవడం కాదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News