Amith Shah: మమత, చంద్రబాబుల వల్ల ఒరిగేదేం లేదు: అమిత్ షా

  • విపక్ష పార్టీలు చేతులు కలపడంపై విమర్శలు
  • రామాలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
  • కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల వైఖరేంటో చెప్పాలి

ఉత్తరప్రదేశ్‌లో మమతా బెనర్జీ కానీ.. చంద్రబాబు కానీ లేదంటే ఇతరులు కానీ చేసే ప్రచారం కారణంగా ఒరిగేదేమీ లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. నేడు ఆయన జాన్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలు చేతులు కలపడంపై విమర్శలు గుప్పించారు.

దేవెగౌడ లక్నోలో ప్రచారం చేసినా.. చంద్రబాబు మీర్జాపూర్ వచ్చినా.. మమత కాశీ వచ్చినా.. స్టాలిన్ జాన్‌పూర్‌లో ప్రచారం చేసినా ఒరిగేదేమీ ఉండదన్నారు. అయోధ్యలో దివ్యమైన రామాలయం కట్టడానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. తమ సంకల్పాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అమిత్ షా పేర్కొన్నారు. రామాలయ నిర్మాణంపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీల వైఖరేంటో తెలపాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News