amit bhandari: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ పై దాడి!
- అమిత్ భండారిపై అల్లరిమూక దాడి
- జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై దాడి చేసిన అనూజ్ దేడా
- తల, చెవి భాగంలో గాయాలు
భారత మాజీ ఫాస్ట్ బౌలర్, ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అమిత్ భండారిపై అల్లరి మూక దాడి చేసింది. ఢిల్లీ అండర్-23 జట్టులోకి తనను ఎంపిక చేయనందుకు కక్ష పెంచుకున్న అనూజ్ దేడా అనే యువకుడు తన స్నేహితులతో కలసి ఈ దాడికి పాల్పడ్డాడు.
ఇనుపరాడ్లు, హాకీ స్టిక్స్, సైకిల్ చైన్లతో దాడి చేశారు. ఈ ఘటనలో భండారి తల, చెవి భాగంలో గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అనూజ్ దేడాను అరెస్ట్ చేశారు. 2000-2004 మధ్య రెండు వన్డేల్లో భారత జట్టుకు భండారి ప్రాతినిధ్యం వహించాడు. రంజీల్లో ఢిల్లీ తరపున 95 మ్యాచ్ లు ఆడి 314 వికెట్లు తీశాడు. మరోవైపు ఈ దాడిని మాజీ క్రెకెటర్లు బిషన్ సింగ్ బేడీ, వీరేంద్ర సింగ్, గౌతమ్ గంభీర్ లు ఖండించారు.