India: సెలక్షన్ ఓ సవాల్... ఈ 30 మంది నుంచే వరల్డ్ కప్ క్రికెట్ జట్టు!
- త్వరలో లండన్ లో వరల్డ్ కప్ క్రికెట్
- అవకాశం వస్తే రాణిస్తున్న యువ ఆటగాళ్లు
- ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై సమాలోచనలు
ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టులో అవకాశం వచ్చిన వారంతా రాణించారు. నిజానికి ఈ విషయం సంతోషించ తగ్గదే. అయితే, మరో రెండు నెలల్లో వరల్డ్ కప్ క్రికెట్ ఆడాల్సిన భారత జట్టు ఎంపికను మాత్రం యువ ఆటగాళ్లు అత్యంత క్లిష్టం చేశారు. ఎవరిని ఎంపిక చేయాలో, ఎవరిని పక్కన బెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో సెలక్షన్ కమిటీ ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించడం గమనార్హం.
వరల్డ్ కప్ పోటీలకు మొత్తం 30 మంది ప్రాబబుల్స్ ను ఎంపిక చేశామని, వారి నుంచి ఇంగ్లండ్ కు ప్రయాణం కావాల్సిన 15 మంది ఎవరన్న విషయం తేల్చేందుకు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లను సమీక్షిస్తామని ఆయన అన్నారు. త్వరలో జరిగే ఐపీఎల్ పోటీల్లో ఆటతీరును మాత్రం వరల్డ్ కప్ కు పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
ప్రాబబుల్స్ లోని 30 ఆటగాళ్ల వివరాలు...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్, అజింక్య రహానే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్య, కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మనీష్ పాండే, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, పార్థివ్ పటేల్, మాయాంక్ అగర్వాల్, సురేష్ రైనా, శ్రేయాస్ అయ్యర్, శుభ్ మన్ గిల్, అంబటి రాయుడు, వాషింగ్టన్ సుందర్.
కాగా, వీరిలో కోహ్లీ, రోహిత్, శిఖర్ ధావన్, ధోనీ, దినేష్ కార్తీక్, షమీ, రవీంద్ర జడేజా, బుమ్రా, అంబటి రాయుడు, అశ్విన్, భువనేశ్వర్ ల పేర్లు దాదాపు ఖరారేనని తెలుస్తోంది. మరో నాలుగు స్థానాల కోసం మిగతా వారంతా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.