rafale: పార్లమెంటు ప్రాంగణంలో పేపర్ విమానాలు విసిరిన కాంగ్రెస్ నేతలు
- నేడు పార్లమెంటు ముందుకు రానున్న రాఫెట్ డీల్ పై కాగ్ రిపోర్టు
- పార్లమెంటు ముందు నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్
- పేపర్ విమానాలను గాల్లోకి విసిరిన నేతలు
రాఫెల్ ఫైటర్ జెట్ డీల్ పార్లమెంటులో ఈరోజు కూడా ప్రకంపనలు సృష్టించింది. పార్లమెంటు ఎదుట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీలతో పాటు కాంగ్రెస్ కీలక నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా పేపర్ విమానాలను గాల్లోకి విసిరారు. వీటిపై మోదీ, అనిల్ అంబానీల చిత్రాలను అతికించారు. రాఫెల్ అంశానికి సంబంధించిన కాగ్ రిపోర్టు ఈరోజు పార్లమెంటు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాగ్ రిపోర్టును తీసి పారేశారు. కాగ్ రిపోర్టును 'చౌకీదార్ (కాపలాదారుడు) ఆడిటర్ జనరల్' రిపోర్టుగా అభివర్ణించారు. మరోవైపు, కాగ్ రిపోర్టులో యుద్ధ విమానాల ధరలను పేర్కొనలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.