bjp: మోసం, బెదిరింపులే మోదీ ప్రభుత్వ విధానం: సోనియా గాంధీ

  • ప్రజలు ఆశించిన ఫలితాలు నెరవేరలేదు
  • పార్లమెంట్ సమావేశాలు సరైన రీతిలో జరపట్లేదు
  • దేశంలోని వ్యవస్థలను ప్రభుత్వం నాశనం చేసింది

ప్రధాని మోదీపై యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మోసం, బెదిరింపులే మోదీ ప్రభుత్వ విధానమని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో ప్రజలు ఆశించిన ఫలితాలు నెరవేరలేదని, ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. పార్లమెంట్ సమావేశాలు కూడా సరైన రీతిలో జరపట్లేదని, ప్రతిపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించేందుకు ఆస్కారం లేకుండా పోతోందని విమర్శించారు.

దేశంలోని వ్యవస్థలను ప్రభుత్వం నాశనం చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించిందని, రాజ్యాంగబద్ధ విలువలు, సూత్రాలు, నిబంధనలపై మోదీ ప్రభుత్వం దాడి కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో, జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితులు బాగా లేవని అన్నారు. దేశంలో రైతులకు, నిరుద్యోగులకు న్యాయం జరగట్లేదని విమర్శించారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన గెలుపు తమలో నమ్మకాన్ని నింపిందని అన్నారు. తమ ప్రత్యర్థి పార్టీలు ఇంతకుముందు చాలా శక్తిమంతంగా ఉన్నట్టు కనబడ్డాయి కానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ నేరుగా వారితో పోరాటం జరిపి, మన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారని అన్నారు. 

  • Loading...

More Telugu News