NTR: ఎన్టీఆర్ ‘కొండవీటి సింహం’ చిత్రం ‘కొండవీడు’ ప్రతిష్ఠను పెంచింది: సీఎం చంద్రబాబు
- ముగిసిన కొండవీడు ఉత్సవాలు
- రెండురోజుల పాటు ఘనంగా నిర్వహణ
- కొండవీడు ఘాట్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
ఎన్టీఆర్ కొండవీటి సింహం చిత్రం ‘కొండవీడు’ ప్రతిష్ఠను పెంచిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా కొండవీడు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండురోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు.
కొండవీడు ఘాట్ రోడ్డును ప్రారంభించి, కొండవీడు వనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కొండపైన పుట్టాలమ్మ, ముత్యాలమ్మ, వెదుళ్ల చెరువులను, కట్టడాలు, దేవాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొండవీడు కోట దిగువన నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. కొండవీడు చరిత్రపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. కొండవీడు సామ్రాజ్యం, వైభవం, కైఫీయత్ పుస్తకాలను ఆవిష్కరించారు.
అనంతరం, కొండవీడు కోట దిగువన నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఈ కోటకు ఘనమైన చరిత్ర ఉందని అన్నారు. దీనిపై ఎన్నో సినిమాలు వచ్చాయని అన్నారు. రూ.34 కోట్లతో తక్కువ వ్యవధిలో ఘాట్ రోడ్ ని నిర్మించినట్టు తెలిపారు.