EPFO: ఈపీఎస్-95 కింద కనీస పింఛను రూ.3 వేలకు పెంపు?
- ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న పింఛన్
- రూ. 3 వేలకు పెంచితే 50 లక్షల మందికి లబ్ధి
- గురువారం సమావేశం కానున్న ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు
ఈపీఎస్-95 (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం) ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అందిస్తున్న వెయ్యి రూపాయల కనీస పింఛన్‌ను మూడువేలకు పెంచాలని యోచిస్తోంది. అదే జరిగితే దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. గురువారం సమావేశం అవుతున్న ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఈపీఎఫ్ వడ్డీ రేట్లను కూడా బోర్డు ఖరారు చేయనుంది. మార్కెట్లో వడ్డీ రేట్లు పడిపోతున్నప్పటికీ ఎన్నికల సంవత్సరం కాబట్టి, ఈపీఎఫ్ వడ్డీరేటును మాత్రం 8.55 శాతంగానే ఉంచాలని భావిస్తున్నట్టు సమాచారం.