Guntur District: రైతు కోటయ్య మృతికి చంద్రబాబు, పుల్లారావే బాధ్యులు: వైసీపీ నేత పార్థసారధి
- ఈ ఘటనకు పోలీసులు కూడా బాధ్యత వహించాలి
- రైతుల పట్ల టీడీపీ అహంకార ధోరణిని కనబరుస్తోంది
- ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించాలి
గుంటూరు జిల్లా కొండవీడులో బీసీ రైతు కోటయ్య మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావే బాధ్యులని వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ఆరోపించారు. కొండవీడులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనకు పోలీసులు కూడా బాధ్యత వహించాలని అన్నారు. రైతుల పట్ల టీడీపీ అహంకార ధోరణిని కనబరుస్తోందని, కోటయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. కోటయ్య మృతిపై పోలీసులు అసత్యాలు చెబుతున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.