sensex: తొమ్మిది రోజుల నష్టాలకు బ్రేక్.. దూసుకుపోయిన సెన్సెక్స్
- 404 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 131 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- మెటల్, ఐటీ, బ్యాంకింగ్ సూచీల అండ
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వానికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా తొమ్మిది రోజుల పాటు నష్టపోయిన సెన్సెక్స్ ఈరోజు దూసుకుపోయింది. మెటల్, ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అండతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో కొనసాగిన ర్యాలీ కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 404 పాయింట్లు లాభపడి 35,756కు పెరిగింది. నిఫ్టీ 131 పాయింట్లు పుంజుకుని 10,735కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో వేదాంత లిమిటెడ్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాలను మూటగట్టుకున్నాయి. బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, హిందుస్థాన్ యూనిలీవర్,ఇండస్ ఇండ్ బ్యాంక్ లు నష్టపోయాయి.