sensex: వారాంతాన్ని ఫ్లాట్ గా ముగించిన మార్కెట్లు
- ఉదయం నుంచి స్తబ్దుగానే కొనసాగిన మార్కెట్లు
- 26 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 2 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని ఫ్లాట్ గా ముగించాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో... ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు స్తబ్దుగానే కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 35,871కు పడిపోయింది. నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 10,792 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో యస్ బ్యాంక్, వేదాంత లిమిటెడ్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. కొటక్ మహీంద్ర బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ తదితర కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.