Real Estate: గృహ కొనుగోలుదారులకు జీఎస్టీ నుంచి ఊరట: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
- జీఎస్టీ కౌన్సిల్ 33వ సారి సమావేశం
- నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
- సొంతింటి కలను నిజం చేయనున్నామన్న జైట్లీ
రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊరట లభించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రకటన చేశారు. జీఎస్టీ కౌన్సిల్ 33వ సారి ఈరోజు సమావేశమైందని చెప్పారు.
అందరికీ ఇళ్లు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజల సొంతింటి కలను నిజం చేయనున్నామని అన్నారు. అందుకు, జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం తోడ్పడుతుందని చెప్పారు. తాజా నిర్ణయం ప్రకారం రూ.45 లక్షల లోపు గృహాల కొనుగోలుపై జీఎస్టీ 1 శాతం వర్తిస్తుందని, తగ్గించిన జీఎస్టీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.