Jyothiraditya Sindhiya: అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదిస్తాం: కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా

  • అధికారంలోకి రాగానే మహిళా రిజర్వేషన్ బిల్లు
  • గతంలో చర్చకు రాకుండానే ఆగిపోయింది
  • దాదాపు 170 మంది మహిళలకు స్థానం

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు 2010 మార్చి 9న రాజ్యసభలో ఆమోదం పొందింది కానీ, లోక్‌సభలో చర్చకు రాకుండానే ఆగిపోయింది. దీనిపై నేడు కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. అంగన్ వాడీ కార్యకర్తలతో నిర్వహించిన శక్తి సంవాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింథియా మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్ తొలి సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తామన్నారు.

యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు తామంతా మహిళా పక్షపాతులమని వ్యాఖ్యానించారు. తన భార్య ప్రియదర్శిని రాజే సింథియా పోటీపై స్పందించిన జ్యోతిరాధిత్య.. ప్రస్తుతానికి తానొక లోక్‌సభ సభ్యునిగా ప్రజల ముందు నిలుచున్నానని.. కానీ ఈ లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్లమెంట్ సభ్యురాలి భర్తనవుతానని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే మహిళా రిజర్వేషన్ బిల్లు పెడతామని.. అప్పుడు తన భార్యతోపాటు దాదాపు 170 మంది మహిళలకు లోక్‌సభలో స్థానం లభిస్తుందని జ్యోతిరాదిత్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News