punjab national bank: నీరవ్ మోదీ ఆస్తుల అటాచ్
- ముంబయి, సూరత్ లోని నీరవ్ ఆస్తులు స్వాధీనం
- మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ రూ.147.72 కోట్లు
- ఈడీ అధికారుల ప్రకటన
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ మోదీ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ముంబయి, సూరత్ లోని నీరవ్ ఆస్తులను మనీలాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఎనిమిది ఖరీదైన కార్లు, ప్లాంట్ మెషీన్లు, బంగారు ఆభరణాలు, విలువైన పెయింటింగ్స్ తో పాటు కొన్ని స్థిరాస్తులు కూడా ఉన్నట్టు తెలిపింది. మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ రూ.147.72 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు.