sargical strikes: మయన్మార్‌ సరిహద్దుల్లోనూ ఉగ్రవాద శిబిరాలు...వాటిపైనా దాడులు చేయాలి: పల్లంరాజు

  • సైనికపోరు చేయలేని పాకిస్థాన్‌ అడ్డదారి మార్గం ఉగ్రవాదం
  • భారత్‌ వాయుసేన తెగువ గర్వకారణం
  • ప్రధాని మోదీ సొంత ప్రచారానికి వాడుకోవడమే దారుణం

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను తుదముట్టించడంలో భారత్‌ వాయుసేన తెగువ, ధైర్యసాహసాలకు హేట్యాప్‌ అని, ఇది జాతికే గర్వకారణమని కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. అయితే వాయుసేన సాహసాన్ని తనదిగా ప్రధాని మోదీ ప్రచారం చేసుకోవడమే అభ్యంతకరమని విమర్శించారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మయన్మార్‌ సరిహద్దుల్లోనూ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలు చాలా ఉన్నాయని, వాటిపై కూడా దాడులు చేయాలన్నారు. యుద్ధం చేసి గెలిచే సత్తా లేని పాకిస్థాన్‌ అడ్డదారుల్లో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకుందన్నారు. ఈ విషయం తెలిసే అంతర్జాతీయ ప్రపంచం భారత్‌కు మద్దతు పలుకుతోందన్నారు.

ఈ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ భారత్‌ వాయుసేన ధైర్యసాహసాలకు ప్రతిరూపమన్నారు. కానీ మోదీ ధైర్యసాహసాలు కావని ఎద్దేవా చేశారు. అసలు కశ్మీర్‌ ప్రజల మద్దతు కోల్పోవడమే మోదీ పెద్ద వైఫల్యమని విమర్శించారు. పుల్వామా వంటి ఉగ్రదాడులు మితిమీరడానికి ఇదే కారణం అని వ్యాఖ్యానించారు. మోదీ వచ్చాకే భారత ప్రభుత్వంపై కశ్మీర్‌లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ముందు కశ్మీర్‌ ప్రజల మనసు చూరగొనే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News