India: యుద్ధం మొదలైతే మన చేతుల్లో ఉండదు.. కూర్చుని మాట్లాడుకుందాం రండి: భారత్ కు పాక్ ప్రధాని పిలుపు
- యుద్ధం మొదలైతే నా చేతుల్లో కానీ, మోదీ చేతుల్లో కానీ ఉండదు
- భారత సైన్యం మా భూభాగంలోకి వచ్చింది
- పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుసార్లు కోరామన్న ఇమ్రాన్
రెండు దేశాల మధ్య యుద్ధం అంటూ మొదలైతే అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు కనుక, కలిసి కూర్చుని మాట్లాడుకుందామని భారత్ కు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పిలుపు నిచ్చారు. పాకిస్థాన్ ప్రజలను ఉద్దేశించి ఇమ్రాన్ ప్రసంగించారు. ఒకసారి యుద్ధం మొదలైతే కనుక తన చేతుల్లో కానీ, మోదీ చేతుల్లో కానీ అది ఉండదని అన్నారు. అందుకే, ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలని ఆకాంక్షించారు. పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుసార్లు విజ్ఞప్తి చేశామని అన్నారు. భారత సైన్యం తమ భూభాగంలోకి వచ్చిందని, అందుకే, తాము భారత భూభాగంలోకి రావాల్సి వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ సమర్థించుకున్నారు. పుల్వామా ఘటన, ఇతర అంశాలపై భారత్ తో చర్చించేందుకు సిద్ధమని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.