kalyan ram: యువ దర్శకుడికి ఓకే చెప్పిన కల్యాణ్ రామ్
- ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా విరించి వర్మ
- తదుపరి సినిమా కల్యాణ్ రామ్ తో
- పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన '118'కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఇలా థియేటర్స్ కి వచ్చిందో లేదో, తన తదుపరి సినిమా కోసం ఓ యువ దర్శకుడికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఆ దర్శకుడు ఎవరోకాదు 'ఉయ్యాలా జంపాలా' .. 'మజ్ను' చిత్రాల దర్శకుడు విరించి వర్మ. ఈ రెండు సినిమాలు కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.
ఇటీవలే ఈ దర్శకుడు కల్యాణ్ రామ్ కి ఒక కథ వినిపించాడట. కథలోని కొత్తదనం కారణంగా .. విరించి వర్మకి ఓకే చెప్పేశాడని సమాచారం. ప్రస్తుతం విరించి వర్మ ఈ స్క్రిప్ట్ పైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఇంతవరకూ చేయని పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడని అంటున్నారు. మే నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.