jagan: జగన్ సీఎం అయితే ఆస్తులను ఉండనిస్తాడా అనే సందేహం కలుగుతోంది: ప్రత్తిపాటి పుల్లారావు
- ఓట్ల తొలగింపు వ్యవహారంలో దొంగే దొంగ అని అరిచినట్టు ఉంది
- మోదీ, కేసీఆర్ ల డైరెక్షన్ లో ఓట్ల తొలగింపుకు జగన్ శ్రీకారం చుట్టారు
- వైసీపీలాంటి క్రిమినల్ పార్టీని ప్రజలు నమ్మరు
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో దొంగే దొంగ అని అరిచినట్టు జగన్ తీరు ఉందని అన్నారు. జగన్ సీఎం అయితే ఆస్తులను ఉండనిస్తాడా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ల డైరెక్షన్ లో ఏపీలో ఓట్లను తొలగించేందుకు జగన్ శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తొలగించేందుకు ఫారం7ను జగన్ ఆయుధంగా చేసుకున్నారని చెప్పారు. వైసీపీలాంటి క్రిమినల్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో 150 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.