Maharashtra: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బంగ్లాను డైనమైట్లతో పేల్చి, కూల్చేసిన అధికారులు!

  • అలీబాగ్ లో రూ.100 కోట్లతో నిర్మాణం 
  • రూపాన్యాగా నామకరణం
  • అక్రమంగా నిర్మించడంతోనే కూల్చేశామంటున్న అధికారులు

ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అధికారులు షాక్ ఇచ్చారు. మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా అలీబాగ్ లో నీరవ్ ఇష్టపడి కట్టుకున్న రూ.100 కోట్ల విలువైన బంగ్లాను అధికారులు డైనమైట్లతో పేల్చి కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ కట్టడాన్ని నిర్మించడంతో కలెక్టర్ సమక్షంలో ఈ కూల్చివేతను పూర్తి చేశారు.
అలీబాగ్ లో రూపాన్యా పేరుతో నీరవ్ ఈ బంగ్లాను నిర్మించారు. దాదాపు 33,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవంతిలో స్విమ్మింగ్ పూల్, ఖరీదైన ఫిట్టింగ్స్, డ్రైవ్ వే, కట్టుదిట్టమైన భద్రత ఉన్నాయి. కాగా, భారీ యంత్రాలను వాడినప్పటికీ భవన నిర్మాణంలో వాడిన నాణ్యమైన సిమెంట్ కారణంగా కూల్చివేత ప్రక్రియ ఆలస్యమయింది. దీంతో అధికారులు డైనమైట్ల సాయంతో భవనాన్ని కుప్పకూల్చారు. ప్రస్తుతం నీరవ్ మోదీ పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News